రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోజిది : కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లెఫ్టు (వామపక్షాలు) రైటు (మిగతా విపక్షాలు) వాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు మీద బీజేపీ చేస్తోన్న ఇవాళ్టి దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోజు కానుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్లు కుప్పకూలడం ఖాయమని మరో నేత వెంకయ్య నాయుడు భాష్యం చెప్పారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విద్యుత్ పోరు దీక్ష శిబిరంలో బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.