Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల ముందు ఛార్జీలు పెంచడం పార్టీకి నష్టం : వీహెచ్

ఏడాదిలో ఎన్నికలు రాబోతోన్న తరుణంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం పార్టీకి తీవ్రనష్టం కలిగిస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపు సరికాదని ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్టీ సీనియర్ నేతలతో చర్చించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు.   

More Telugu News