అసలే ఎండలు ... ఆపైన కరెంటు కోత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసలే ఎండలు ... ఆపైన కరెంటు కోత!

భానుడి తాకిడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో రానురాను ఎండలు ముదిరిపోతున్నాయ్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సెలవుదినమైన నేడు ఇంటిలో ఆహ్లాదంగా గడుపుదామనుకున్న సామాన్య ప్రజలు ఉక్కపోతతో సతమతమైపోతున్నారు. దీనికి విద్యుత్ కోతలు తోడవడంతో మరింత ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  

కాగా, ఇవాళ కడపలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నంద్యాల, కర్నూలు, అనంతపురం, రెంటచింతల, హన్మకొండలో 40 డిగ్రీలు, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో 39 డిగ్రీలు, ఆదిలాబాద్, హైదరాబాద్, రామగుండం, తిరుపతిలో 38 డిగ్రీలు, నందిగామ, నెల్లూరు, తుని, విజయవాడ, విశాఖ, భద్రాచలం, నల్గొండలో 37 డిగ్రీలు, హకీంపేట, కావలి, ఒంగోలులో 36 డిగ్రీలు, కాకినాడలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

More Telugu News