వైరస్ కు చెక్ పెట్టే నూతన సాంకేతిక ప్రక్రియ
మానవుడి ఆరోగ్యానికి
సంబంధించిన నూతన ఔషధాల ఆవిష్కరణకు ప్రపంచవ్యాప్తంగా నిత్యం పరిశోధనలు
జరుగుతూనే వున్నాయి. అందులో భాగంగా మనిషి ప్రాణాలను హరించే హెచ్ఐవీ వంటి
వైరస్ లను మట్టుబెట్టే సామర్ధ్యం కలిగిన వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడే
సాంకేతిక ప్రక్రియను శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు. ప్రాణాంతక వైరస్
లను సమర్ధవంతంగా ఎదుర్కుని, మన రోగ నిరోధక వ్యవస్థ తగిన యాంటీ బాడీస్ ను
ఉత్పత్తి చేయడానికి ఈ నూతన సాంకేతిక ప్రక్రియ ఎంతగానో తోడ్పడుతుందని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తినిచ్చే 'ఇమ్యూనోజెన్' అనే పదార్ధం ప్రవేశ పెట్టడం ద్వారా, వైరస్ వినాశక యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేయడంలో ఈ ప్రక్రియ కీలకమని అంటున్నారు. ప్రస్తుతం ఎలుకలపై జరుగుతున్న ప్రయోగాలు సత్పలితాలు ఇస్తున్నాయి. మరిన్ని ప్రయోగాలు చేసిన తరువాత ఈ సాంకేతిక ప్రక్రియను అందుబాటులోకి తెస్తారు.