బోరు బావి నుంచి క్షేమంగా బయటపడిన బాలుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బోరు బావి నుంచి క్షేమంగా బయటపడిన బాలుడు!

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుంతలపురిలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని అయిదు గంటల ప్రయత్నం అనంతరం క్షేమంగా వెలికితీశారు. అదృష్టవశాత్తు కేవలం 20 అడుగుల లోతు వరకే బాలుడు పడిపోవడంతో ఎర్త్ మూవర్ల వంటి పరికరాలను ఉపయోగించి సురక్షితంగా బయటకి తీశారు. బాలుడు మరింత కిందకి జారిపోకుండా చర్యలు చేపట్టడంతో క్షేమంగా వెలికితీయడం సాధ్యమైంది. రెండున్నరేళ్ల బాలుడు తండ్రి వెనుకే నడుస్తూ వెళ్తుండగా, తెరచి ఉన్న బోర్ వెల్ లో పడిపోయాడు.

తమిళనాడులో ఈ నెలలో ఇది రెండో బోరుబావి ఘటన. ఏప్రిల్ 6వ తేదీన విల్లుపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరులో ఒక బాలిక పడిపోయింది. మూడేళ్ల ఆ బాలికను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూండటంతో తమిళనాడు హైకోర్టు ఉపయోగంలో లేని బోరుబావులను మూసివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

More Telugu News