Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీకి సీట్లిస్తే...స్వతంత్రులను నిలబెడతాం: బాబుకు హెచ్చరిక

బీజేపీకి ప్రకాశం జిల్లాలో సీట్లు కేటాయిస్తే స్వతంత్రులుగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టి తీరుతామని ఆ జిల్లా టీడీపీ నేతలు అధినేతకు హెచ్చరికలు పంపారు. ఈ మేరకు హైదరాబాద్ లో గిద్దలూరు టీడీపీ కార్యకర్తలు బలరాంను కలిశారు. జిల్లాలో బీజేపీకి సీట్లు కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తమ విన్నపాన్ని విస్మరించి బీజేపీకి సీట్లు కేటాయిస్తే... స్వతంత్రులుగా పార్టీ కోసం కృషి చేసిన వారిని నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు.

More Telugu News