చోగమ్ సదస్సు పై తుది నిర్ణయం ప్రధానిదే : కేంద్రమంత్రి
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న కామన్ వెల్త్ దేశాధినేతల సమావేశం (చోగమ్ సమిట్)ను భారత్ బహిష్కరించాలంటూ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యాలయంలో మంత్రి వి.నారాయణ స్వామి ఈరోజు ఓ ప్రకటన చేశారు. `చోగమ్` విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో చర్చించిన తర్వాతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఈ అంశం మీద ఇప్పటికే తమిళనాట పెద్ద చర్చే జరుగుతోంది. కామన్ వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొన కూడదని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇదే విషయంపై కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీకూడా తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. ఈ అంశం మీద తాజాగా యూనియన్ షిప్పింగ్ మినిస్టర్ జికె వాసన్ కూడా గొంతు కలిపారు.
శ్రీలంకలో తమిళులపై జరుగుతోన్న అఘాయిత్యాలపై కొన్ని రోజులుగా, తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు తీవ్రంగా అసహనం వెళ్లగక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ తో శ్రీలంకకు సంబంధం ఉన్న ప్రతి విషయంలోను తమిళులు తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు
-
రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు
-
రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 126 పాయింట్లు డౌన్
-
మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని.. వీడియో ఇదిగో!
-
బీఎస్ఎన్ఎల్లో రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్.. 25కు పైగా ఓటీటీలు!