: కుమార్తె నామినేషన్ విరమింపజేయాలని పాల్వాయికి జైరాం సూచన


కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మునుగోడు నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కుమార్తె స్రవంతితో నామినేషన్ ఉపసంహరింపజేయాలని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి కేంద్రమంత్రి జైరాం రమేశ్ సూచించారు. ఈ ఉదయం పాల్వాయిని పిలిపించుకుని మాట్లాడిన జైరాం, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒక సీటు నేపథ్యంలో పాల్వాయి కుమార్తెకు టికెట్ దక్కలేదు. దాంతో, రెండు రోజుల కిందట నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానానికి ఆమె నామినేషన్ వేశారు.

  • Loading...

More Telugu News