అవును, నేను తప్పు చేశాను: కేజ్రీవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవును, నేను తప్పు చేశాను: కేజ్రీవాల్

‘అవును... నేను తప్పు చేశాను. రాజీనామా చేయడం తప్పే’ అంటున్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎంగా అధికారం చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని కేజ్రీవాల్ అంగీకరించారు.

రాజీనామా చేయడానికి సైద్ధాంతిక కారణాలున్నా, రాజీనామా చేసిన టైమింగ్ మాత్రం పొరపాటేనని ఆయన అన్నారు. ‘ప్రజలకు మరింత వివరణను ఇచ్చి, సభలు పెట్టి, మా అభిప్రాయాన్ని చెప్పి, ఆనక రాజీనామా చేసి ఉంటే బాగుండేదేమో. అలా చేయకుండా నేరుగా రాజీనామా చేయడం వల్ల ప్రజలకు మా పట్ల అనుమానాలు పెరిగాయి. వారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అన్నారు కేజ్రీవాల్.

ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వం 49 రోజులకే కుప్పకూలడంతో ఆమ్ ఆద్మీ మద్దతుదారుల్లో నిరాశ, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తుండగా కేజ్రీవాల్ పై రాళ్లు విసరడం, లెంపకాయ వేయడం వంటి ఘటనలు జరిగాయి. మొన్న అయితే లాలీ అనే ఆటో డ్రైవర్ సుల్తాన్ పూర్ లో కేజ్రీకి మెడలో పూలమాల వేసి మరీ చెంప ఛెళ్లుమనిపించాడు.

More Telugu News