దేశాన్ని ఓ 'మంత్రగత్తె' పాలిస్తోంది: మోడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశాన్ని ఓ 'మంత్రగత్తె' పాలిస్తోంది: మోడీ

భారతదేశాన్ని గత పదేళ్లుగా ఓ ‘మంత్రగత్తె’ పాలిస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్షంగా సోనియాగాంధీని విమర్శించారు. భారతీయ జనతాపార్టీ ఓ మాంత్రికుడిని తెచ్చిందని, ఆయన రాత్రికి రాత్రే అంతా మార్చేస్తానంటున్నాడని తనను ఉద్దేశించి సోనియా చేసిన వ్యాఖ్యలను ఆయన జంషెడ్ పూర్ లో ఇవాళ జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం ఓ మంత్రెగత్తెను తెచ్చిందని, ఆమె గత పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోందని, తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయని, రైతుల కష్టాలు పెరిగాయని ఆయన అన్నారు. మంత్రగత్తె వల్ల దేశం పదేళ్లుగా దుస్థితిలో ఉందని, తనను తాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను కష్టాల్లో పడేసిందని మోడీ మండిపడ్డారు. తాను చాలా పేద కుటుంబంలో పుట్టానని, అందువల్ల పేదల కష్టాలు తనకు తెలుసునని మోడీ అన్నారు. నోట్లో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని పరోక్షంగా రాహుల్ గాంధీని ఆయన విమర్శించారు.

More Telugu News