20వ తేదీన ఇంటర్ విద్యార్థులకు ఉపకార వేతన అర్హతా పరీక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

20వ తేదీన ఇంటర్ విద్యార్థులకు ఉపకార వేతన అర్హతా పరీక్ష

హైదరాబాదులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులో ప్రవేశించే విద్యార్థులకు ఈ నెల 20వ తేదీన ఉపకార వేతన అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు హైదరాబాదు జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మస్తాన్ షరీఫ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత మార్చిలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరై, నెలకు రూ. 8,000 లోపు ఆదాయం కలిగిన మైనార్టీ విద్యార్థులు సంస్థ నిబంధనల ప్రకారం ప్రవేశం పొందేందుకు అర్హులని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే అర్హత పరీక్షకు పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ రెండు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని షరీఫ్ సూచించారు. 30 నిమిషాలు ముందుగానే పరీక్షా హాలుకు చేరుకోవాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలకు సెల్. 98665 56838లో సంప్రదించవచ్చునని అన్నారు.

More Telugu News