టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్

తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సైపై దౌర్జన్యం చేసిన కేసులో ఆయనను పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభాకర్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి తన అనుచరుల్ని అక్రమంగా విడిపించుకుని పోయారు. ఈ ఘటనపై పెదవేగి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

More Telugu News