: 63.9 లక్షల కార్లను వెనక్కి రప్పిస్తున్న టొయోటా
టొయోటా కారు అంటే ఒకప్పుడు మంచి మోజు ఉండేది. టొయోటా కారును జపాన్ ఆటోమొబైల్ విప్లవంగా పేర్కొనేవారు. అలాంటి టొయోటా కారుని సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. సౌకర్యాల కల్పన కోసం చేసిన సర్దుబాట్లు నాణ్యతాపరమైన సమస్యల్ని తెచ్చిపెట్టాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టొయోటా కంపెనీ ఉత్పత్తి చేసిన 63.9 లక్షల వాహనాలను వెనక్కి రప్పిస్తొంది.
ఇంజిన్ స్టార్టర్లలోని సమస్యల వల్ల అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్ల వల్ల ఆర్ఏవీ4, కరోలా, యారిస్, మాట్రిక్స్, హైలాండర్ వంటి మోడల్స్ లో సాంకేతిక సమస్యలు ఉన్న 27 మోడల్స్ ను వెనక్కి రప్పిస్తోంది. విండ్ షీల్డ్ వైపర్ మోటార్స్, స్టీరింగ్ కాలమ్ బ్రాంకెట్స్, ఇంజిన్ స్టార్టర్లు, ఎయిర్ బ్యాగ్స్ తో కనెక్ట్ అయిన కేబుల్స్ వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
వీటి కారణంగా మంటలు చెలరేగడం, యాక్సిడెంట్లు చోటుచేసుకోవడంతో సమస్యల్ని సరిదిద్దేందుకు వాటిని వెనక్కి రప్పిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ సమస్య వల్ల 35 లక్షల వాహనాలు, సీట్ రెయిల్స్ వల్ల 16.7 లక్షల వాహనాలను సంస్థ వెనక్కి రప్పిస్తోంది. గత నెలలో జనరల్ మోటార్స్ ఇగ్నిషన్ సమస్య కారణంగా 26 లక్షల వాహనాలను వెనక్కి రప్పించింది.