నేను ముద్దు పెట్టుకుంటే ఆయన చెంపదెబ్బ కొడతారు: అలియా భట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ముద్దు పెట్టుకుంటే ఆయన చెంపదెబ్బ కొడతారు: అలియా భట్

తండ్రులకు కూతుళ్లంటే ఎక్కడ లేని అభిమానం ఉంటుంది. తమ గారాలపట్టి ఎప్పటికీ తమ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. తన తండ్రి కూడా అలాగే ఉంటున్నారని, తనకు పెళ్లి చేయాలని ఆయన అనుకోవట్లేదని బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కుమార్తె అలియా భట్ చెబుతోంది. తనతోను, తన సోదరి షహీన్ తోను ఇటీవల ఆయన మాట్లాడారని, "మీరు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేసేస్తా" అన్నారని, తామిద్దరిపైనా ఆయనకున్న ప్రేమకు ఇది నిదర్శనమని అలియా చెప్పింది.

అలియా తాజా చిత్రం 2స్టేట్స్ లో ఒక ముద్దు సన్నివేశం ఉంది. దాని గురించి చెబుతూ, "సినిమాల్లో కాబట్టి... ఆయన ఊరుకుంటున్నారు, అదే ఆయన ఎదురుగా తన బోయ్ ఫ్రెండ్ ను ముద్దుపెట్టుకుంటే వెంటనే లెంపకాయ ఇవ్వడం ఖాయం" అని చెప్పింది. ఇంతకు ముందు అలియా నటించిన 'హైవే' సినిమా హిట్టయిన సంగతి తెలిసిందే.

More Telugu News