: విమానం గల్లంతై నెల రోజులు...ప్రగతి ఇంతే
మలేషియా విమానం గల్లంతై నేటికి నెల రోజులు పూర్తయింది. మార్చి 8న ఆచూకీకి అందకుండా దారిమళ్లిన మలేషియా విమానం నిఘానేత్రానికి చిక్కకుండా అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆ విమానం కోసం వివిధ దేశాలు అంతర్జాతీయ జలాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మలేషియా చొరవతో ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో 11 సైనిక విమానాలు, 14 నౌకలు దాదాపు 77,580 చదరపు కిలోమీటర్ల దూరాన్ని జల్లెడపడుతున్నాయి.
ఆస్ట్రేలియన్ నౌక ఓషన్ షీల్డ్, చైనా నౌక హైసూన్ 01 నౌకలకు ఓ విమానం బ్లాక్ బాక్స్ నుంచి సిగ్నల్స్ వచ్చాయి. అవి మలేసియా విమానానివా కాదా అనేది నిర్థారణ జరగాల్సి ఉంది. ఈ రెండు నౌకలతో పాటు బ్రిటిష్ నౌక హెచ్ఎంఎస్ ఇకో కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటోంది.