Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామా వాణిజ్య రాయబారిగా సల్మాన్ ఖాన్

అమెరికాలో ప్రఖ్యాత ఖాన్ అకాడమీకి చెందిన ఎన్నారై సల్మాన్ ఖాన్ ను ఆ దేశ ప్రథమ పౌరుడు ఒబామా అంతర్జాతీయ వాణిజ్య రాయబారిగా నియమించారు. కోల్ కతాలో పుట్టిన సల్మాన్ ఖాన్ గణితం, సైన్సు, మరిన్ని అంశాలపై 4,800కు పైగా వీడియో పాఠాలు రూపొందించారు. ఆయన తండ్రి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంటున్నారు. ఈయన స్థాపించిన ఖాన్ ఆకాడమీకి చెందిన యూట్యూబ్ చానల్ కు 16,33,000 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

వైట్ హౌస్ నియమించిన పలువురు అంతర్జాతీయ వాణిజ్య రాయబారుల్లో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. వీరంతా వాణిజ్య రంగంలో ఆరితేరిన నిపుణులు. కొత్తగా నియమించిన రాయబారులతో ఒబామా సమావేశమయ్యారు. తమ సమయం, శక్తి, ఆలోచనలు, అనుభవం పంచుకుని అమెరికా మరింత అభివృద్ధి చెందేందుకు, తరువాతి తరాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఒబామా ఆకాంక్షించారు.

More Telugu News