: "అవును... భార్యను, కూతురును నేనే చంపేశాను"


కట్టుకున్న భార్యను, కన్న కూతుర్ని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. పైగా చంపిన తర్వాత హంతకుడు తీరిగ్గా పోలీసు స్టేషన్ కు వెళ్లి "నేనే నా భార్యను, కూతుర్ని చంపేశాను" అని చెప్పి లొంగిపోవడం నివ్వెరపోయేలా చేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున భార్యను, కుమార్తెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘోరాన్ని వివరించి నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News