సంగీత దర్శకుడు రమణ గోగులకు తప్పిన ముప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంగీత దర్శకుడు రమణ గోగులకు తప్పిన ముప్పు

గోవానుంచి హైదరాబాద్ వస్తోన్న విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. గోవా విమానాశ్రయంలో రన్ వే పై టేకాఫ్ చేస్తుండగా విమానం డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. ప్రయాణీకులు ఆందోళనతో కేకలు వేశారు. దీంతో పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకి దించాడు. ఈ విమానంలో సినీ సంగీత దర్శకుడు రమణ గోగులతోపాటు 200 మంది ప్రయాణీకులు ఉన్నారు. అనంతరం మరో విమానంలో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చే ఏర్పాట్లు చేశారు. 

More Telugu News