Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీకి మరో పిలుపొచ్చింది

ఉత్తేజపూరితమైన ప్రసంగాలివ్వడంలో దిట్టని పేరు తెచ్చుకున్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి అమెరికా వర్గాల నుంచి ఆహ్వానం అందింది. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న అమెరికా రాజకీయ, వాణిజ్య ప్రతినిధులు ఈరోజు మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు గుజరాత్ లో మోడీ పాలనకు కితాబిచ్చారు. ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు అమెరికా రావాలని మోడీని కోరగా, వారి విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమం వచ్చే జూన్ లో ఉండనున్నట్టు సమాచారం. ఇంతకుముందు, మోడీ వార్టన్ సదస్సులో ప్రసంగించాల్సి ఉండగా, వివిధ కారణాలరీత్యా ఆయన ప్రసంగం రద్దయింది.  అనంతరం, అమెరికాలోనే జరిగిన 'డయాస్పోరా' కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 

More Telugu News