లైట్లు సరిగా వెలగకపోతే క్యాచ్ లు ఎలా పడతాం: యువరాజ్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైట్లు సరిగా వెలగకపోతే క్యాచ్ లు ఎలా పడతాం: యువరాజ్ సింగ్

బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఫీల్డర్ల వెతలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పలు క్యాచ్ లు చేజారిన వైనం ప్రత్యక్ష ప్రసారాలు కళ్ళకు కట్టాయి. నాలుగు మ్యాచ్ లలో పది క్యాచ్ లు నేలపాలు కావడం సమస్య తీవ్రతను ఎత్తిచూపుతోంది. టీమిండియాలో అగ్రశ్రేణి ఫీల్డర్లనదగ్గ యువరాజ్ సింగ్, కోహ్లీ సైతం బంతిని జారవిడిచి ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అయితే, దీనంతటికీ కారణం స్టేడియాల్లో లైటింగ్ వ్యవస్థ సరిగాలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై, యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, మిడ్ వికెట్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కాంతి కాస్త తక్కువగా పడుతోందని, తద్వారా బంతిని అంచనా వేయడం కష్టంగా మారుతోందని వాపోయాడు.

More Telugu News