Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో మోడీతో భేటీ కానున్న మరో సినీ హీరో మోహన్ బాబు

ప్రముఖ సినీ హీరో మోహన్ బాబు త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఇటీవలే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మోడీని కలిశారు. నిన్న సాయంత్రం సినీ హీరో నాగార్జున కూడా మోడీని కలిసిన సంగతి తెలిసిందే.

More Telugu News