Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాషింగ్టన్ లో కొండ చరియలు విరిగిపడి విధ్వంసం

వాషింగ్టన్ లో విధ్వంసం జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గల్లంతయ్యారు. పలు గ్రామాల్లో 15 అడుగుల ఎత్తున బురద, మట్టి పేరుకుపోయింది. కార్లు, నివాసాలు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. సియాటిల్ కు 55 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 2 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది.

కొండ చరియలు విరిగిపడి ఆరు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 18 మంది జాడ తెలియడం లేదు. గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే చాలా చోట్ల బురద భయంకరంగా ఉండటంతో సహాయకచర్యల్లో ఉన్న కార్యకర్తలు బురదలో కూరుకొని పోయారని, వారిని కాపాడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు అన్నారు.

More Telugu News