రాయపాటి నడిచే దేవుడు...ఆయనతో వెళ్లాలా? వద్దా? అనే ధర్మసంకటంలో ఉన్నాను: డొక్కా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయపాటి నడిచే దేవుడు...ఆయనతో వెళ్లాలా? వద్దా? అనే ధర్మసంకటంలో ఉన్నాను: డొక్కా

రాయపాటితో వెళ్లాలా? వద్దా? అనే ధర్మసంకటంలో ఉన్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాయపాటి నడిచే దేవుడని అన్నారు. తనకు ఈ మాత్రం గుర్తింపు, ఈ జీవితం రావడానికి కారణం రాయపాటేనని అన్నారు. అలాంటి రాయపాటి అడిగితే చేయకుండా ఉండనని డొక్కా స్పష్టం చేశారు. ఇప్పటికే తాను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నానని, నియోజకవర్గంలోని కార్యకర్తలతో మాట్లాడి తగిన నిర్ణయిం తీసుకుంటానని డొక్కా తెలిపారు.

More Telugu News