మత ఘర్షణల అంశంతో ఓట్లు రాల్చుకునే యత్నాలొద్దు: జయప్రద
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మత ఘర్షణల అంశంతో ఓట్లు రాల్చుకునే యత్నాలొద్దు: జయప్రద

గతేడాది ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన మత ఘర్షణలు దురదృష్టకరమని సినీనటి, రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయప్రద అన్నారు. ఈ అంశాన్ని కొన్ని పార్టీలు ఓట్లు రాబట్టుకునేందుకు వినియోగించుకుంటున్నాయని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశాన్ని ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోరాదన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి జయప్రద పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. మతఘర్షణల అంశాన్ని పక్కనపెట్టి... రైతుల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

More Telugu News