12 మంది చిన్నారులపై వృద్ధుడి లైంగిక వికృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

12 మంది చిన్నారులపై వృద్ధుడి లైంగిక వికృతి

12 మంది చిన్నారుల పాలిట ఒక వృద్ధుడు కామాసురుడిగా మారాడు. పేదవారి కోసం స్కూల్ నిర్వహిస్తూ ఒకటి నుంచి మూడో తరగతి చదువుతున్న ఆరు నుంచి తొమ్మిదేళ్ల వయసులోపు బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీన్ని చాటుగా వీడియో తీసిన ఉన్నత తరగతి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ లో హిమాలయన్ అనే రెసిడెన్షియల్ స్కూల్లో ఇది జరిగింది. 70 ఏళ్ల నిందితుడు చంద్రసింగ్ కర్క తమను కార్యాలయంలోకి పిలిచి లైంగికంగా హింసించేవాడని బాధిత బాలికలు పోలీసులకు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.

More Telugu News