దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హోలీ శుభాకాంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హోలీ శుభాకాంక్షలు

రేపు హోలీ పండుగ పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యమత్యంగా జరుపుకునే హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, వెలుగుల కాంతిని నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల్లో సామరస్యాన్ని, ఐక్యమత్యాన్ని ఈ పండుగ మరింత పెంపొందించాలని ప్రణబ్ తన సందేశంలో పేర్కొన్నారు. రంగుల హోలీ ప్రజల జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ఉపరాష్ట్రపతి అన్సారీ తెలిపారు.

More Telugu News