విమానం అదృశ్యం ఘటనలో మరో మలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానం అదృశ్యం ఘటనలో మరో మలుపు

మలేసియా విమానం కనిపించకుండా పోయి వారం దాటినా గాలింపు చర్యల ఫలితం శూన్యం. 26 దేశాలు వాయు, జలమార్గాల్లో అన్వేషిస్తున్నా విమానం జాడ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ చేసిన కీలక ప్రకటన ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. వియెన్నాలో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీటీబీటీఓ) కొన్ని వివరాలు వెల్లడించింది. గత కొద్దిరోజులుగా భూమిపైనా, సముద్రంలోనూ ఎలాంటి పేలుడు, కూలిపోవడం గానీ తాము గుర్తించలేదని తెలిపింది.

ప్రపంచ దేశాలు ఏవైనా అణు పరీక్షలు జరిపితే కలిగే సూక్ష్మ విస్ఫోటనాన్ని సైతం సీటీబీటీఓ పసిగట్టగలదు. ఆమేరకు దీనికి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. ఓ పెద్ద విమానం కూలిపోయినా ఇది గుర్తించగలదు. సీటీబీటీఓ ప్రకటన అనంతరం విమానం హైజాక్ కు గురై ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

More Telugu News