ఇదే... అమెరికా ద్వంద్వ నీతి
అగ్రరాజ్యం నీతి ఎప్పుడూ అడ్డదిడ్డమే. అవసరాలు, సందర్భాలను బట్టి నాలుక మార్చడం ఆ దేశనైజం. భారత దౌత్యవేత్త దేవయానిపై వీసా మోసం అభియోగాలు చెల్లవంటూ కోర్టు తీర్పు చెప్పగా... అమెరికా అధికారులు 24 గంటల్లోనే తిరిగి అవే అభియోగాలను నమోదు చేశారు. కోర్టు చెల్లవన్న తర్వాత మళ్లీ నమోదు చేయడం సరికాదని భారత్ ప్రకటన జారీ చేసింది. అమెరికా చర్య ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అయినా ఇది ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని తాజాగా అమెరికా ప్రకటించింది.
దేవయానిపై కేసు అంశం న్యాయవ్యవస్థ పరిధిలో ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ పాస్‌కి విలేకరులతో అన్నారు. భారత్ తో భవిష్యత్ సంబంధాలపై ఎంతో ఆశాభావంతో ఉన్నామన్నారు. విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ప్రస్తుతం భారత్ లో ఉన్నారని, దీని ద్వారా సంబంధాలు బలపడతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక, రక్షణ తదితర వ్యూహాత్మక అంశాలపై భారత్ తో కలసి పనిచేస్తామని చెప్పారు. ఒకవైపు భారత దౌత్యవేత్తపై ప్రతీకార చర్యలు, మరోవైపు భారత్ తో సంబంధాల బలోపేతానికి మంత్రాంగాలు ఇవే అమెరికా ద్వంద్వ నీతిని తెలియజేస్తున్నాయి.