మీడియాకు ఆమడ దూరంలో ధోనీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీడియాకు ఆమడ దూరంలో ధోనీ

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియా అంటే ఆమడ దూరం పారిపోతున్నాడు! ఇటీవల చెత్త ప్రదర్శనలు, ఐపీఎల్ ఫిక్సింగ్ పై ఎక్కడ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందోనని ధోనీ భావిస్తున్నట్టుంది. అందుకే, నిన్న శ్రీలంకతో ప్రాక్టీసు మ్యాచ్ లో ఓటమి అనంతరం ధోనీ సహా ఇతర క్రికెటర్లెవ్వరూ మీడియా సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు లంక జట్టు నుంచి సచిత్ర సేనానాయకే మీడియా ముందుకొచ్చాడు.

నిన్న రాత్రి మిర్పూర్ లో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో మలింగ (4/30) ధాటికి భారత్ 148 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాలో యువరాజ్ (33) టాప్ స్కోరర్. ధావన్ (2), రోహిత్ శర్మ (4), రహానే (0) తీవ్రంగా నిరాశపరిచారు. ఇక, 'ఛేజింగ్ హీరో' కోహ్లీ (17) ని మలింగ్ బౌల్డ్ చేశాడు. చివర్లో అశ్విన్ 12 బంతుల్లో 19 పరుగులు చేసినా ఫలితం దక్కలేదు. మలింగ అతడిని పెవిలియన్ చేర్చాడు. చివరి వికెట్ గా బరిలో దిగిన అమిత్ మిశ్రా ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డయ్యాడు. ఈ వికెట్ కూడా మలింగ ఖాతాలోకే చేరింది.

More Telugu News