Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ సైన్యాధిపతికి బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ ఆయనకు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోక్ సభ టికెట్ కేటాయించింది. సోమవారం ఘజియాబాద్ వెళ్లిన సింగ్ కార్యకర్తల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. వందలాది మంది కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ టికెట్ సింగ్ కు కేటాయించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకున్నారు. దీంతో ఎన్నికల్లో ఆయన గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి.

More Telugu News