టీఆర్ఎస్ లోకి కొండా దంపతులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లోకి కొండా దంపతులు!

కొండా మురళి, సురేఖ దంపతులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఆ పార్టీతో కొండా మురళి చర్చలు జరిపారు. వారి చేరికకు ఆ పార్టీ అంగీకరించడంతో గులాబీ కండువా పుచ్చుకోవడం ఖాయంగా మారింది. ఈ క్రమంలో ఈ సాయంత్రం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కొండా దంపతులు ప్రకటన చేయనున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలో చేరి మళ్లీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన వీరిద్దరూ గతేడాది కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

More Telugu News