Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

200కు పైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది: వెంకయ్యనాయుడు

బీజేపీ 200కు పైగా స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దక్షిణాది నుంచి సగానికి పైగా స్థానాలను గెలుచుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పొత్తులపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ నెలలోనే మోడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సభలు ఉంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించలేదని, ఎవరు పార్టీ పెట్టినా మంచిదేనని సూచించానని, మీడియా తన వ్యాఖ్యలు వక్రీకరించిందని ఆయన అన్నారు. జనసేన విధివిధానాలు ప్రకటించిన తరువాత ఆ పార్టీపై తమ విధానం ఉంటుందని ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టమని అధిష్ఠానం తనను ఆదేశించిందని ఆయన వెల్లడించారు.

More Telugu News