పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా లేదు: పీసీ చాకో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా లేదు: పీసీ చాకో

దేశంలో కాంగ్రెస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని ఆ పార్టీ సీనియర్ నేతలు వరుసగా అంగీకరిస్తున్నారు. దాంతో, ఇప్పుడిప్పుడే తమ మనసులోని అసంతృప్తిని బయట పెడుతున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని హస్తం ఒత్తిడి చేస్తోంది. వారిలో ఒకరు ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో. ఈ క్రమంలో కేరళలోని ఎర్నాకుళం ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉందని చెప్పారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదన్నారు. కానీ, దేశంలో రాజకీయ వాతావరణం కాంగ్రెస్ కు అనుకూలంగా లేదన్నారు. కాబట్టి, తప్పకుండా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుందన్నారు. యూపీఏ-2 హయాంలో ప్రభుత్వం చాలా సాధించింది కానీ, ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. అంతేగాక 2జీ స్కాంతో సహా చోటు చేసుకున్న పలు అవినీతి కేసులు కాంగ్రెస్ హవాను మసకబారేలా చేశాయని అభిప్రాయాపడ్డారు.

More Telugu News