బీజేపీ అగ్రనేతల లోక్ సభ స్థానాలు ఖరారు.. వారణాసి నుంచి మోడీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఢిల్లీలో భేటీ అయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఓ ప్రకటన చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. దాంతో, కాన్పూర్ నుంచి మురళీ మనోహర్ జోషి బరిలోకి దిగనున్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ లక్నో నుంచి, అగ్రనేత అరుణ్ జైట్లీ అమృత్ సర్ నుంచి పోటీకి దిగుతున్నారు.