Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు లక్షల చామంతి పుష్పాలతో ఆదివారం నాడు శ్రీచక్రార్చన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్ సమీపంలోని శ్రీచక్రపురం దేవీ ఆశ్రమంలో 1001 శ్రీచక్రాలకు ఆదివారం నాడు మూడు లక్షల చామంతి పుష్పాలతో శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఈరోజు (శనివారం) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పౌర్ణమి రోజు చాలా విశిష్టతగలదని... ఉదయం 9 గంటలకల్లా భక్తులు ఆలయానికి రావాలని, చామంతి పువ్వులను ఆలయం వారే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పూజలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆయన చెప్పారు. మగవారు పంచె, కండువా, ఆడవారు చీర, జాకెట్టు, యువతులు లంగా ఓణితో వచ్చి పూజలో పాల్గొనాలని ఆయన సూచించారు. కుంకుమార్చనకు సంబంధించిన పూజాసామగ్రిని కూడా తామే ఇస్తామని ఆయన తెలిపారు.

More Telugu News