తెలంగాణలో పవన్ ప్రభావం అంతంత మాత్రమే: ఉత్తమ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో పవన్ ప్రభావం అంతంత మాత్రమే: ఉత్తమ్ కుమార్

జనసేన పార్టీ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పవన్ చిన్న పిల్లవాడని, నిన్న జరిగిన సభలో సినిమా డైలాగులు చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణలో పవన్ ప్రభావం అంతంత మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు తెలంగాణ సమస్యలను పట్టించుకోని పవన్... ఇప్పుడు పార్టీ పెట్టి మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన చెప్పారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఉత్తమ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

More Telugu News