'లైవ్' రికార్డులు తిరగరాయనున్న టి20 వరల్డ్ కప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లైవ్' రికార్డులు తిరగరాయనున్న టి20 వరల్డ్ కప్

బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న టి20 వరల్డ్ కప్ లైవ్ బ్రాడ్ కాస్ట్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఐసీసీ చెబుతోంది. ఇప్పటివరకు తాము నిర్వహించిన అన్ని ఈవెంట్లను వీక్షకుల సంఖ్య పరంగా ఇది అధిగమిస్తుందని ఐసీసీ తెలిపింది. ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకిస్తారని అంచనా. ఈ టోర్నీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ చేజిక్కించుకుంది. స్టార్ నుంచి 29 ఇతర సంస్థలు ప్రసార హక్కుల సబ్ కాంట్రాక్టును పొందాయి. 20 భాషల్లో ఈ టోర్నీ ప్రసారం అవుతుంది. యూరప్ ప్రాంతంలో యూరోస్పోర్ట్ మ్యాచ్ లను లైవ్ గా అందిస్తుంది. అంతేగాకుండా, ఈసారి నార్వే, పసిఫిక్ దీవులు, ఆఫ్ఘనిస్తాన్ లోనూ మ్యాచ్ లను బ్రాడ్ కాస్ట్ చేయనున్నారు.

More Telugu News