ఎన్నికల్లో నల్ల డబ్బుపై నిఘా కోసం హెల్ప్ లైన్
ఎన్నికలు సమీపిస్తుండడంతో నిధుల ప్రవాహం కూడా ఊపందుకుంటోంది. పోలీసు తనిఖీలలో భారీగా పట్టుబడుతున్న డబ్బే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇన్ కమ్ టాక్స్ విభాగం నిఘా తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో హెల్ప్ లైన్ ఆరంభించింది. నిర్విరామంగా పనిచేసే ఈ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెం.1800110132. డబ్బు అక్రమ మార్గాల ద్వారా రవాణా అవుతుందన్న అనుమానం వస్తే ఎవరైనా ఈ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని ఐటీ విభాగం తెలిపింది.