వార్న్, కలిస్ లను వెనక్కి నెట్టిన సచిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వార్న్, కలిస్ లను వెనక్కి నెట్టిన సచిన్

ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ ఈఎస్పీఎన్ క్రికిన్ఫో సంస్థ సచిన్ ను 'నేటి తరం క్రికెటర్' గా ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం రేసులో సచిన్... లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మహోన్నత ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ లను వెనక్కి నెట్టడం విశేషం. ముంబయిలో నిన్న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ కు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సచిన్ స్పందిస్తూ, నిజాయతీగా చెప్పాలంటే మాటలు రావడంలేదని చెప్పారు. అవార్డు ప్యానల్లో తనకు మద్దతు పలికిన మెంబర్లు రాహుల్ ద్రావిడ్, మార్టిన్ క్రోతో పాటు, ఈఎస్పీఎన్ క్రికిన్ఫో సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు.

More Telugu News