నాపై లేఖ ఇచ్చిన విషయం తెలియదు: రేణుకా చౌదరి
కొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తనపై ఆరోపణలు చేస్తూ, పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ ఇచ్చిన విషయం తనకు తెలియదని ఆ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. నేతలు తనపై విమర్శలకు దిగకుండా తెలంగాణ పునర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ నేతలు కృషి చేయాలని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో రేణుక, మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భేటీ అయ్యారు.