బొత్సకు అనుచరుల ఝలక్
పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణకు స్వంత జిల్లాలో అనుచరులు ఝలకిచ్చారు. విజయనగరం జడ్పీ మాజీ ఛైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో, బొత్సకు స్వంత జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 40 మంది సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను వంచించాయని, జగన్ లోని పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు చూసి పార్టీలో చేరామని బెల్లాన తెలిపారు.