Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటితో ముగుస్తున్న మొదటి దశ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 13న మొదలైన అసెంబ్లీ మొదటి దశ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం, రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ఛార్జీలపైనే ఈ 14 రోజులు అసంపూర్తిగా చర్చలు జరిగాయి. విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. కాగా, నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. మరోవైపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సభ ఆమోదం తెలుపనుంది.

More Telugu News