పీసీసీ చీఫ్ అనేది పదవి కాదు బాధ్యత: రఘువీరారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీసీసీ చీఫ్ అనేది పదవి కాదు బాధ్యత: రఘువీరారెడ్డి

పీసీసీ చీఫ్ అనేది పదవి కాదని, బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు ఎన్నికల ముందు పార్టీని వీడారని అన్నారు. కాంగ్రెస్ ను వీడినవారు, వీడాలనుకుంటున్నవారు పునరాలోచించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ బాగున్నప్పుడు అందరం మంచిని పంచుకున్నామని, ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీకి నష్టం జరిగినా నష్టాన్ని అందరం కలిసి పంచుకుందామని రఘువీరా పిలుపునిచ్చారు. పాతికేళ్లు పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించానని, ఇప్పుడు కూడా అందర్నీ సమన్వయం చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు.

More Telugu News