Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాత్రంతా మేల్కొని పనిచేసేవారే గొప్పవారవుతారు...!

నిన్న తప్పనుకున్నది.. నేడు ఒప్పవుతోంది. ఎందుకలా అంటారా.. అయితే ఈ కథనం చదవండి.. 
 
నిజమే.. మన పెద్దాళ్లు చెప్పినట్టు త్వరగా నిద్రపోయి, త్వరగా మేల్కోవడం వల్ల ఒరిగేదేమీ లేదంటున్నాయి తాజా అధ్యయనాలు. అంతేకాదు ఈ విషయాన్ని ఉదాహరణలతో సహా రూఢీ చేస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రతిభావంతులుగా వెలుగొందుతోన్న వారంతా రాత్రంతా మేల్కొని తమ పనులు చక్కబెట్టుకునే వారే అని తెగేసి చెబుతున్నాయి.

ఈ అంశానికి సంబంధించి లండన్ కు చెందిన ఓ అధ్యయన సంస్థ ప్రయోగం నిర్వహించింది. ఇందుకోసం టీనేజర్లను ఎంపిక చేసుకుని వారిని రెండు గ్రూపులుగా విభజించింది. వీరిని తెలతెలవారుతుండగా లేచే పక్షులు అనీ, గుడ్లగూబలు అనే రెండు బృందాలుగా చేసింది. నిర్ణీత సమయంలో వీరి దేహ గడియారాలు (బాడీ క్లాక్) పనితీరుని విశ్లేషించింది. ఇందులో రాత్రంతా మేల్కొని పనిచేసే వారికి ప్రతిభ, పోటీతత్వం, మేధాశక్తి కచ్చితంగా అద్భుతంగా ఉన్నట్లు వెల్లడైందని రుజువులతో సహా నిరూపించింది.
  
అంతేకాదు..  ఇలా రాత్రంతా మేల్కొని సంచలనాలు నెలకొల్పిన మేధావుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చార్లెస్ డార్విన్, అడాల్ఫ్ హిట్లర్, విన్ స్టన్ చర్చిల్, జేమ్స్ జాయిన్, ఎల్విన్ ప్రెస్లీ వంటి వారెందరినో పరిశోధకులు ఉదాహరణగా చూపించారు కూడా. అదండి నేటి సంగతీ...  

More Telugu News