రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ

రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు (గురువారం) రాష్ట్రంలోని రాజకీయ పక్షాలతో సమావేశమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వాయిదా అంశంపై పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించనుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంవీ మైసూరారెడ్డి, టీడీపీ నుంచి మండవ వెంకటేశ్వరరావు, సీపీఐ తరపున నారాయణ, సీపీఎం నుంచి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి కమలాకరరావు, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.

More Telugu News