ఎన్నికల ముందు లాలూకు వాస్తు కష్టాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల ముందు లాలూకు వాస్తు కష్టాలు!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఎన్నికల ముందు వాస్తు కష్టాలు పడుతున్నారు. ఇటీవల 16కు పైగా ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడం, నిన్న (బుధవారం) ఆర్జేడీ ప్రధాన నేత రామ్ కృపాల్ యాదవ్ బీజేపీలో చేరడంతో ఆయనకు పెద్ద దెబ్బే తగిలింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇలా జరుగుతుండటంతో తీవ్రంగా ఆలోచించిన లాలూ ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణుడిని సంప్రదించాడట. ఇంటి ప్రాంగణంలో ఓ పక్కన ఉన్న గుంటను మట్టి, ఇసుకతో పూడ్చివేయాలని సదరు వాస్తు నిపుణుడు సూచించాడట. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నట్లు లాలూ ఇంటికి చెందిన సిబ్బందిలోని ఓ వ్యక్తి తెలిపాడు.

2005లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు 2006లో జరిగిన ఛాత్ పండుగ కోసం లాలూ తన ఇంటి ప్రాంగణంలో ఓ గుంటను తవ్వించాడట. ఇప్పుడదే ఆయన కుటుంబం, పార్టీపై వ్యతిరేక ప్రభావం, అడ్డంకులను సృష్టిస్తుందని చెప్పారట. కాగా, లాలూకు మూఢ నమ్మకాలపై విశ్వాసం ఉందని, జ్యోతిషశాస్త్రం, ఆచారాలను నమ్ముతారని, సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారని ఆర్డేడీ నేత ఒకరు చెప్పారు.

More Telugu News