Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి అభిమానుల ఏర్పాట్లు

నటుడు పవన్ కల్యాణ్ 'జనసేన' పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు హైదరాబాదు మాదాపూర్ లోని హైటెక్స్ లో సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రత్యక్ష ప్రసారానికి అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీమాంధ్ర, తెలంగాణలోని 28 కేంద్రాల్లో పవన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రస్తుతం అందరూ పవన్ పార్టీపైనే చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో పవన్ ఏం మాట్లాడతాడు, ఎలాంటి విషయాలపై తన అభిప్రాయాలను చెబుతాడనే దానిపై ఉత్కంఠగా ఉన్నారు.

More Telugu News