విశాఖను వర్ణించిన బాబు
పచ్చని నగరం, రమణీయ ప్రదేశం, సాగరతీరం అంటూ చంద్రబాబు నాయుడు విశాఖ వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ తర్వాత సుందరమైన ప్రదేశం అని అభివర్ణించారు. సింగపూర్ మాదిరి ఒకప్పుడు ముచ్చటైన నగరం అని పేర్కొన్నారు. విశాఖ అంటే తనకెంతో అభిమానం అని స్పష్టం చేశారు. ఈ సభలో తమ్ముళ్ళ ఆవేశం చూస్తే కొండల్నయినా పిండి చేయగలమన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు.