కేసీఆర్ తో భేటీ అయిన కోదండరాం
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఎన్జీవో నేత దేవిప్రసాద్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. కోదండరాంను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కేసీఆర్ నిన్ననే ఆహ్వానించారు. అయితే తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కోదండరాం సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు కేసీఆర్ తో చర్చల తర్వాత కోదండరాం మనసు మారుతుందా? లేక రాజకీయాలకు దూరంగానే ఉంటారా? అనే విషయం కాసేపట్లో తేలనుంది.