Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్షమాభిక్ష తీర్పును పున:సమీక్షించం... కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం

క్షమాభిక్ష పిటిషన్లపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాంలంగా పెండింగ్ లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు... మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 15 మంది ఉరిశిక్ష జీవిత ఖైదుగా మారింది. ఈ నేపథ్యంలో, ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చడాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఈ రోజు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

More Telugu News